Consumer News 24 - ఆంధ్రప్రదేశ్ / : దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ రాజకుమార్ దారు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేశారు. వీరికి స్థానిక ఎన్సిఆర్సి ప్రతినిధులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించగా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను తీర్థప్రసాదాలను ఎన్సీఆర్సీ శ్రీకాళహస్తి ప్రతినిధులు అందజేశారు. రాజ్ కుమార్ దారు వెంట జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కుసుమకుమారి, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డిప్యూటీ చైర్మన్ కోటేశ్వర బాబు, ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి, స్టేట్ అబ్జర్వర్ వెంకట కిషోర్, స్టేట్ ఆర్టిఐ ఇంచార్జ్ భరత్ కుమార్ నాయుడు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఉపాధ్యక్షులు తాళ్లపాక సురేష్, మహిళా వింగ్ స్టేట్ అబ్జర్వర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.
Admin
Consumer News 24