Consumer News 24 - తెలంగాణ / : తెలంగాణ 16/03/2025 స్వచ్ఛ వార్త లకిడికపూల్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రెడ్ హిల్స్ సువర్ణ సువర్ణ ఆడిటోరియం సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ నాయక్, ప్రముఖ పండిత్ శర్మ, లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రముఖ న్యాయమూర్తి, ప్రముఖ క్రియాశీలక వక్తులు పాల్గొన్నారు. ఎన్సిఆర్సి సభ్యులు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బాలరాజు పర్యవేక్షణలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అతిధులు. వినియోగదారుల హక్కుల్ని సంరక్షిస్తూ ఇప్పటికే 13 రాష్ట్రాలలో ఎన్సిఆర్సి విస్తరింప జరిగింది. సుమారు ఎనిమిది రాష్ట్రాల చైర్మన్లు ఈ వేడుకలో పాల్గొనడం గమనార్హం. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు తమ విలువైన అనుభవాలు మరియు వినియోగదారుల హక్కుల సంరక్షణకు తమ వంతు బాధ్యతలు తెలిపారు మరింత కట్టుదిట్టంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలకు ఎలాంటి హక్కులు జారీ చేయాలో తెలిపారు నానుడిగా కల్తీ సామ్రాజ్యం పెరిగిపోతుండటంతో ప్రజల ఆరోగ్యాలకు భద్రత లేకుండా పోయిందని లీగల్ మెట్రోలజీ వాపోయింది. తనిఖీలు పేరుతో వ్యవస్థ ముందుకు వెళ్లిన తతనంతరం జరగవలసిన ల్యాబ్ టెస్టులు అలసత్వం అవుతుందని రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకే ల్యాబ్ ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంకి 5 ల్యాబ్లు కావాలని అడిగితే మూడు ల్యాబ్లకి అనుమతులు ఇచ్చిందని కానీ అందులో పని చేసే సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలిపారు. ఉండాల్సింది 150 మందిని కానీ అంత సిబ్బంది అక్కడ అందుబాటులో లేరని తెలిపారు. కల్తీ అయిన ఆహార పదార్థాలు భుజించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని వాపోయారు. దానికి మరో ఉదాహరణ తెలుపుతూ తెలంగాణలో ప్రముఖ హోటల్స్ లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు అని పత్రికల్లో టీవీల్లో ప్రచురించిన తమకు సంబంధం లేదు అన్న ధోరణిలో వినియోగదారుడు ఉన్నాడని ఆయన అన్నారు. తనిఖీలు చేస్తున్నారు అంటే అక్కడ ఏదన్నా కల్తీ జరిగిందా అనే విధంగా వినియోగదారుల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్సీఆర్సీ కి ఉందని ఆయన వాక్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల చైర్మన్లు మాట్లాడుతూ ఫౌండర్ ఎంవిఎల్ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పల్లెల్లో కూడా మరింత చైతన్య పరుస్తున్నామని సేవతో కూడిన చైతన్యం చేయడం వల్ల మరింత వినియోగదారులకు దగ్గరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫౌండర్ కం చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 13 రాష్ట్రాల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్నామని గ్రామాల వరకు కూడా తమ సేవలో విస్తరింపజేసి కార్యచరణలో ఉన్నామని ఆయన అన్నారు. వినియోగదారుడు ఏ విధంగా మోసపోకూడదని ప్రతి మెంబర్ తమ విధులు కర్తవ్యం గా నిర్వహించాలని ఆయన అన్నారు. కార్యక్రమా అనంతరం ఎమ్మెల్సీ నాయక్ చేతుల మీదుగా వివిధ రాష్ట్రాలలో వినియోగదారుల్ని చైతన్య పరుస్తున్న ఎన్సీఆర్సి మెంబర్స్ కి ప్రోత్సాహక బహుమతులతో సత్కరించారు.
Admin
Consumer News 24