Consumer News 24 - ఆంధ్రప్రదేశ్ / : వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసమే ‘వినియోగదారుల న్యూస్ ఛానెల్ 24’ ప్రారంభిస్తున్నట్లు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం హోటల్ లో గురువారం సాయంత్రం ‘వినియోగదారుల న్యూస్ ఛానెల్ 24’ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ఏపీ డిప్యూటీ ఛైర్మన్ యల్లంపాటి కోటేశ్వరబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్ సీఆర్ సీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు, జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజ్ కుమార్ చేతుల మీదుగా వినియోగదారుల న్యూస్ ఛానెల్ 24లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ... శ్రీకాళహస్తీశ్వరస్వామి పాదాల చెంత న్యూస్ ఛానెల్ లోగో ఆవిష్కరణ చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ వెబ్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా వినియోగదారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వినియోగదారులు కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని రాజ్ కుమార్ కోరారు. శ్రీకాళహస్తిలో ఎన్ సీఆర్ సీ ప్రతినిధులు అద్భుతంగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో వీరు మరింత ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ సీఆర్ సీలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రకటించారు. ఎన్ సీఆర్ సీ శ్రీకాళహస్తి బృందాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని ఆయన సూచించారు. అంతకు మునుపు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు, రాజ్ కుమార్ తమ బృందంతో కలసి శ్రీకాళహస్తీశ్వరస్విమిని దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎన్ సీఆర్ సీ ప్రతినిధులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి న్యాయవాధి మునిశేఖర్, ఎన్ సీ ఆర్ సీ రాష్ట్ర ప్రతినిధులు కుసుమ కుమారి, తాళ్లపాక సురేష్, వినయ్, ఆనందరావు, సుధాకర్, వేణుగోపాల్ రెడ్డి ,వెంకట కిషోర్, సుబ్రహ్మణ్యం, దామా విజయ్ కుమార్, బాలాజీ రెడ్డి, హరీష్, భరత్ కుమార్ నాయుడు, శంకర్ సుజిత్ రెడ్డి, శ్రావణి, రాధిక తదితరులు పాల్గొన్నారు.
Admin
Consumer News 24