Consumer News 24 - ఆంధ్రప్రదేశ్ / ఏలూరు : జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏలూరు జిల్లా భీమడోలు మండలం పరిధిలోగల విద్యుత్ వినియోగదారుల పలు సమస్యలను, శుక్రవారం ఉదయం ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏ.పీ. లిమిటెడ్ భీమడోలు అసిస్టెంట్ ఇంజనీర్ ఎం రామస్వామి వారి కార్యాలయమున జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ మరియు జిల్లా కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ ఆయా సమస్యల పరిష్కారానికై వినతి పత్రం అందచేశారు.
అసిస్టెంట్ ఇంజనీర్ ఎం రామస్వామి తక్షణమే స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించి, భవిష్యత్తులో వినియోగదారుల కు తమ యొక్క సేవలను విస్తృతం చేస్తామని తెలియజేశారు
Admin
Consumer News 24