Consumer News 24 - తెలంగాణ / : పీర్జాదిగూడలోని దర్బార్ బాద్ అండ్ రెస్టారెంట్ కలుషిత ఆహారానికి అడ్డాగా మారింది. గతంలోనూ ఈ రెస్టారెంట్లో పలు కేసులు నమోదు అయినా మరోసారి తన వైఖరిలో మార్పు రాలేదు. బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బోడుప్పల్కు చెందిన దత్తాత్రేయ అనే కస్టమర్కు మంగళవారం రాత్రి ఆహారంలో కలుషిత పదార్థాలు వచ్చినందున సిబ్బందిని నిలదీశారు. దీనికి నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో ఆయన సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మేడ్చల్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ సమక్షంలో రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టగా రెస్టారెంట్ బండారం బయటపడింది. కుళ్లిపోయిన కోడుగుడ్లు, పాచిపోయిన చికెన్, బూజుతో వాసనబట్టిన కూరగాయలు, లేబుల్ లేని వెనిగర్, ఎక్స్పైరీ డేట్ కిరాణా విస్తుగొల్పుతున్నాయి. తనిఖీలు చేపట్టిన అధికారులు తాంపిల్స్న ల్యాబ్ టెస్టింగ్కు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం సామాన్లు వాటర్ బాటిళ్లు తదితర వాస్తవాలు దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మేడ్చల్ ఫుడ్ సేఫ్టీ ఇన్ చార్జి ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మీడియాతో తెలిపారు. కాగా యాజమాన్యం మాత్రం తనిఖీలు చేస్తున్న సమయంలో అక్కడ లేకుండా తప్పించుకున్నారు. మీడియాకు సమాధానం ఇవ్వడంలో దాటవేశారు. గతంలోనూ దర్బార్ రెస్టారెంట్ పై కేసులు పీర్జాదిగూడ మెయిన్ రోడ్డులో ఉన్న దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.. ఆహార పదార్థాలు కలుషితంగా ఉన్నందున నిలదీసిన వారిపై సిబ్బంది, యాజమాన్యం దాడులకు కూడా తెగబడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కలుషిత ఆహార పదార్థాలు వాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తక్షణమే రెస్టారెంట్ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Reporter
Consumer News 24